Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ ఫ్యాషన్ షోపై కేసు నమోదు

విశాఖలో జరుగుతున్న వివాదాస్పద ఫ్యాషన్ షోపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను గాయపరిచేలా సాగుతున్న కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఫ్యాషన్ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు. మరో వైపు మహిళలను అసభ్యకరంగా చూపించే ఫ్యాషన్ షోను నిలిపివేయాలని మహిళా, విద్యార్థి, యువజన సంఘాలు ఈ రోజు కూడా విశాఖలో ఆందోళనలు నిర్వహించాయి.

వినాయకుడి బొమ్మలను ముద్రించిన డ్రెస్సులను వేసుకుని మోడళ్ళు క్యాట్ వాక్ చేయడంపై హిందువులు కూడా ఆగ్రహం వ్యక్తం 
చేసారు. మరోవైపు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకులతో మాట్లాడి ఫ్యాషన్ షోను నిలిపివేయించారు. 

More Telugu News